- Step 1
ముందుగా క్యాప్సికమ్‌ను గుత్తుగా కోసుకుని ఉంచుకోవాలి.
- Step 2
అలాగే ఉల్లి, పచ్చిమిర్చిలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- Step 3
బాణాలిలో నూనె వేసి కాగాక, చిటికెడు ఆవాలు, మినపప్పు, జీలకర్ర పొడి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించి దించాలి.
- Step 4
దీనికి తగినంత ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బి చింతపండు పిప్పి, పసుపులను వేసి కలిపాలి.
- Step 5
తర్వాత ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్‌లో పెట్టి ప్యాన్‌లో పెట్టి మూత వేసి ఉడికించాలి.
- Step 6
మూతపై కాసిన్ని నీళ్లు పోయాలి. ఇలా చేస్తే ముక్కలు త్వరగా ఉడుకుతాయి. తర్వాత దించి సర్వ్ చేయాలి.