- Step 1
ముందుగా మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లెడలో జల్లించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అదేవిధంగా ఎండుద్రాక్షలను కూడా శుభ్రం చేసుకుని వాటిపైగల తొడిమలు తీసి తయారు చేసుకోవాలి.
- Step 3
తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్‌లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్‌లాగా తయారు చేసుకోవాలి.
- Step 4
వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి.
- Step 5
తర్వాత ఈ మిశ్రమానికి శుభ్రం చేసిన ఎండు ద్రాక్షను చేర్చి, మైదాను కూడా కలిపి, అరకప్పు పాలు కలుపుకుంటే పిండి జారుగా తయారవుతుంది.
- Step 6
జారుగా ఉండే, క్రీమింగ్ చేసుకున్న పిండిని పేపర్ కప్స్‌లో పోసి 500 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 30 నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 7
తర్వాత స్టౌవ్ మీద నుంచి దించి కేక్‌పై చెర్రీ పండ్లతో కానీ, మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో, క్రీమ్‌తోనూ అలంకరించుకుని సర్వ్‌చేయొచ్చు.