- Step 1
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి తడిఆరే వరకు పక్కన బెట్టుకోవాలి.
- Step 2
తందూరి చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టాలంటే, గాట్లు పెట్టుకోవాలి.
- Step 3
చికెన్ నిమ్మరసం ఉప్పు చికెన్ ముక్కలకు పట్టించాలి. గాట్లులోకి కూడా నిమ్మరసం పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలి.
- Step 4
చికెన్ ముక్కలను 20నిముషాలు రిఫ్రిజరేటర్‌లో పెట్టాలి.
- Step 5
ఉల్లి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గరం మసాలా పేస్ట్‌ను రెండు గంటల తర్వాత ఫ్రిజ్‌లో ఉన్న చికెన్ ముక్కలను పట్టించాలి.
- Step 6
చికెన్ ముక్కలకు మసాలను పట్టించడానికి ముందు మసాలాలో కొద్దిగా ఫుడ్ కలర్‌ను జోడించాలి.
- Step 7
చికెన్ ముక్కలకు మసాలా పట్టించిన తర్వాత తిరిగి చికెన్ ముక్కలను రిఫ్రిజరేటర్‌లో 30-40నిముషాలు ఉంచాలి.
- Step 8
నాలుగు గంటల తర్వాత మ్యారినేట్ చికెన్ బయటకు తీసి, పాన్ స్టౌ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద 10-15నిముషాల వరకూ ఒక్కో వైపు బాగా ఫ్రై చేయాలి.
- Step 9
15నిముషాల తర్వాత చికెన్‌ను రెండువైపులా తిప్పుతూ.. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత బయటకు తీసి గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే సరిపోతుంది.
- Step 10
అంతే తందూరి చికెన్ ఈ రైనీ సీజన్‌కు రెడీ అయినట్లే