- Step 1
పాన్‌లో నెయ్యి వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిముక్కలు, ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి.
- Step 2
అలాగే అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు అందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి కాసేపు వేపుకోవాలి.
- Step 4
బియ్యంలో రిపడా నీళ్ళుపోసి అన్నం ఉడికించుకోవాలి.
- Step 5
ఈ అన్నంలో ఉడికించుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మూత పెట్టాలి.
- Step 6
అన్నం అంతా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లీ దించేయాలి.
- Step 7
అంతే నూరూరించే క్యాప్సికమ్ పులావ్ రెడీ..
- Step 8
ఈ పులావ్‌ను వేడి వేడిగా బటర్ చికెన్, కడాయ్ పనీర్, టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్‌గా ఉంటుంది.