- Step 1
ముందుగా ఓ పాత్రలో కారం, టొమాటో కెచప్, ఉప్పు, గరం మసాలా, మేథీ పొడి, నిమ్మరసం, అల్లం - వెల్లులి పేస్ట్‌లను బాగా కలపాలి.
- Step 2
తర్వాత ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి, సుమారు గంటసేపు నానబెట్టుకోవాలి.
- Step 3
తర్వాత గిలక్కొట్టిన కోడిగుడ్డు సొనను కూడా వేసి, సొన ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
- Step 4
మరో గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో చికెన్ ముక్కల్ని వేసి, ముక్కలకు మైదా బాగా పట్టేవరకూ కలపాలి.
- Step 5
చివరిగా ఓవెన్‌ను 20 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి.
- Step 6
బాస్కెట్‌లో చికెన్ ముక్కలను వేసి, ఎయిర్ ఫ్రయర్‌లో పెట్టి, ఐదు నిమిషాలు ఉంచాలి. ఆరేడు నిమిషాల్లో ముక్కలు వేగిపోతాయి.
- Step 7
ఆ పైన వాటిని ప్లేట్ లోకి తీసుకుని, వాటి మీద చాట్ మసాలా, కారం జల్లి వేడివేడిగా వడ్డించాలి.
- Step 8
అంతే పాప్ కార్న్ చికెన్ రెడీ