- Step 1
మొదట గోంగూరను తొడిమల ఒలుచుకుని శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేసి సరిపడా నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకోవాలి.
- Step 2
మరో వైపు రొయ్యలను కూడా పొక్కులు తీసి బాగా శుభ్రం చేసి ఉంచుకోవాలి.
- Step 3
ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో రొయ్యలు వేసి లైట్ గా వేగించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఆ తర్వాత అదే అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపుదినుసులు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.
- Step 5
ఇప్పుడు అందులోనే ఉడికించి పెట్టుకున్న గోంగూర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
- Step 6
ఐదు నిమిషాల తర్వాత ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకుని పది నిమిషాల పాటు పెద్ద మంట మీద బాగా ఉడికించి చివరిగా కొత్తిమీర తరుగు చల్లి దింపేస్తే సరిపోతుంది.
- Step 7
అంతే రుచికరమైన గోంగూర రొయ్యల కూర రెడీ.
- Step 8
గోంగూర అంటే ఇష్టపడేవారు కేవలం పచ్చళ్లుగానే కాకుండా ఈ విధంగా సీ ఫుడ్‌గా కూడా వండుకుని ఆరగించవచ్చు.