- Step 1
తొలుత చేపలను బాగా శుభ్రం చేసుకుని, సమానంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
కొంత సేపాగి చేపల్లో తేమ ఆరిన తర్వాత వాటిని ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేసి, చేపలకు పట్టించాలి.
- Step 3
మరో వైపు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, జీలకర్ర, కలిపి పేస్ట్ చేసుకోవాలి.
- Step 4
ఈ పేస్ట్‌ను కూడా చేప ముక్కలకు అన్నివైపులా బాగా పట్టించాలి.
- Step 5
అలా అన్నింటిని పట్టించి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- Step 6
ఇప్పుడు ఫ్లాట్‌గా ఉన్న పాన్‌ను తీసుకుని, స్టౌపై పెట్టి, అందులో కొంచెం నూనెను వేసి కరివేపాకు వేసి వేయించాలి.
- Step 7
ఇప్పుడు పక్కన పెట్టుకున్న చేప ముక్కలను రవ్వలో బాగా బొర్చించి చేపలకు అన్ని వైపులా రవ్వ అంటుకునేలా చేయాలి.