- Step 1
కైమాను శుభ్రం చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని ముద్దగా నూరుకోవాలి.
- Step 2
ఉల్లిపాయలను సన్నగా తరిగి ఉంచాలి. శెనగపప్పును పొడి చేసి ఉంచాలి.
- Step 3
ఒక గిన్నె స్టవ్‌పై ఉంచి, అందులో కైమా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలియబెట్టి నీళ్లు పోయకుండానే ఉడికించాలి.
- Step 4
కైమా బాగా ఉడికాక దించి, శెనగ పొడి వేయాలి.
- Step 5
దాంట్లోనే కోడిగుడ్డు పగులగొట్టి బాగా కలిపి ఉంచి, మిశ్రమాన్ని కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి.
- Step 6
ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలో కైమా ఉండలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి.
- Step 7
అంతే వేడి వేడి రుచికరమైన కైమా ఉండలు సిద్దం.
- Step 8
ఈ కైమా ఉండలను ఆపరేషన్ చేయించుకున్నవారికి బలం వచ్చేందుకు తినిపిస్తుంటారు.
- Step 9
రుచిగా ఉండటమేగాకుండా, శరీరానికి బలాన్నిచ్చే ఈ కైమా ఉండలను ఇష్టపడనివారుండరంటే అతిశయోక్తి కాదు.
- Step 10
మీరూ ఓసారి ట్రైచేసి చూడండి మరి..!!