- Step 1
ఎనిమిది కప్పుల నీటిలో బియ్యం రవ్వ, నాలుగు టీసూప్న నూనె, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి.
- Step 2
ఆపై దాన్ని ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా చేసి ఆరబెట్టాలి.
- Step 3
ఇప్పుడు బాణలిలో తగినంత నూనె పోసి వేడయ్యాక ఇంగువ, ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగ పప్పు వేసి వేయించాలి.
- Step 4
తరువాత ఎండుమిర్చి, నిలువుగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీడిపప్పులను కలపాలి.
- Step 5
ఐదు నిమిషాలయ్యాక మామిడి తురుమును కూడా చేర్చి రెండు నిమిషాలపాటు వేయించి స్టౌను ఆర్పేయాలి.
- Step 6
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించి పక్కనుంచిన బియ్యం రవ్వను చేర్చి బాగా కలియబెట్టాలి.
- Step 7
?అంతే కమ్మగా, పుల్లపుల్లగా అలరించే మామిడికాయ రవ్వ పులిహోర తయార్..!!
- Step 8
దీన్ని అలాగే వేడి వేడిగా తింటే అద్భుతంగా, వెరైటీగా ఉంటుంది.