- Step 1
పచ్చి రొయ్యలను శుభ్రం చేసి వాటికి ఉప్పు, కారం కలిపి ఉంచాలి.
- Step 2
బాణలిలో నూనె పోసి కాగాక అందులో రొయ్యల్ని వేసి దోరగా వేయించి తీయాలి.
- Step 3
అదే నూనెలో ఉల్లిపాయ ముద్దను వేసి కాసేపు వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి.
- Step 4
తరువాత కారం, పచ్చిమిర్చి ముద్ద.. అల్లం, వెల్లుల్లి తరుగులను కూడా వేసి కలిపి వేయించాలి.
- Step 5
చివరిగా టొమోటో పేస్ట్‌ను కలిపి వేసి, కలియబెట్టి ఉడికించాలి.
- Step 6
కాసేపటి తర్వాత వేయించి ఉంచిన రొయ్యలను వేసి, ఉప్పు సరిజూసుకుని సన్నటి మంటపై ఉడికించాలి.
- Step 7
తరువాత కసూరి మేథీ, గరంమసాలా, జీడిపప్పులను వేసి బాగా కలియబెట్టి మరికాసేపు ఉడికించాలి.
- Step 8
చివరగా కూర కిందికి దించేముందు మిల్క్ క్రీమ్ కలపాలి. సర్వింగ్ చేసే ముందు కొత్తిమీర తురుము చల్లి వడ్డించాలి.
- Step 9
అంతే ఘుమఘుమలాడే మలాయ్ ప్రాన్ కర్రీ సిద్ధం.