- Step 1
బియ్యం, మినప్పప్పు, మెంతులను కలిపి నీటిలో సుమారు 8 గంటలపాటు నానబెట్టుకోవాలి.
- Step 2
మరుసటి రోజు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా సుమారు 8 గంటలపాటు ఫ్రిజ్‌లో కాకుండా బయటే ఉంచాలి.
- Step 3
పులిసిన పిండిలో ఉప్పువేసి బాగా కలియబెట్టాలి.
- Step 4
ఊతప్పం వేయడానికి ముందు మాత్రమే సోడా వేసి కలపాలి.
- Step 5
పెనం వేడిచేసి ఒక టీస్పూన్ నూనె వేసి పెనమంతా రుద్దాలి.
- Step 6
ఇప్పుడు గరిటెతో పిండిని పోసి మందంగా వేయాలి.
- Step 7
మరో టీస్పూన్ నూనెని ఊతప్పం చుట్టూ వేయాలి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, టొమోటో, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుల్ని వేయాలి.
- Step 8
సిమ్‌లో 5 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత ఊతప్పంను ప్లేటులోకి మెల్లిగా తీయాలి.
- Step 9
అంతే క్యారెట్ ఊతప్పం తయార్. ఇది వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీ లేదా టొమోటో సాస్, సాంబార్‌లతో కలిపి తింటే రుచి అదిరిపోతుంది.
- Step 10
ఆరోగ్యానికి మంచిది కూడా.