మాంసాహార పదార్థాల్లోనే ఎంతో ప్రత్యేకమైన చికెన్’తో ఎన్నోరకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ పాలక్ చికెన్ ఫ్రై ఎంతో రుచికరంగానూ, ప్రత్యేకంగా వుండటంతోబాటు మానవ శరీరానికి కావలసిన పోషకాలు, ప్రోటీనులను కూడా ఇది అందిస్తుంది. అందుకే.. చాలామంది దీనికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. చికెన్’తో చేసే మిగతా ఫ్రైలు కూడా బాగానే వుంటాయిగానీ.. ఆరోగ్యపరంగా ఈ పాలక్ ఫ్రైయే చాలా బెస్ట్.
ఎందుకంటే.. పాలకూరలో ఎన్నోరకాల ప్రోటీనులు, ఎముకులకు కావలసిన పోషకాలు, కాల్షియం, ఐరన్ ఇతర ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. ఇక చికెన్’లో కూడా బోన్స్’కు సంబంధించి ఔషధగుణాలు కొద్దిమేరలో వుంటాయి. ఆ రెండింటి కాంబినేషన్’తో తయారుచేసిన పదార్థాన్ని తింటే.. ఎంతోమేలు! దీనిని తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా తక్కువ సమయంలోనే ఈ ఫ్రైను చేయొచ్చు.