- Step 1
ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక పోపు కోసం సిద్ధం చేసుకున్న దినుసులతో పాటు కరివేపాకు వేసి వేగించాలి.
- Step 2
దోరగా వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేపాలి.
- Step 3
తర్వాత ఉల్లి, మునగ, పచ్చిమిర్చి చీలికలు వేసి 5-10నిముషాలు వేపాలి.
- Step 4
తర్వాత టమోటాముక్కలు, చిటికెడు పసుపు కారం వేసి మూత పెట్టాలి.
- Step 5
5 నిమిషాలు ఆగి గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి మరలా ముత పెట్టి కూరను ఉడికించాలి.
- Step 6
అవసరం అయితే కొద్దిగా నీళ్ళు జత చేసుకోవచ్చు. 5. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
- Step 7
అంతే మునక్కాయ టమోటో కర్రీ రెడీ.
- Step 8
ఈ కర్రీని రోటీలకు లేదా రైస్‌కు సైడిష్‌గా వాడుకోవచ్చు.