- Step 1
ముందుగా ఒక పాత్రలో నాలుగు కోడిగుడ్లను కొట్టి పోసి అందులో సగం ఉల్లి తరుగు వేయాలి.
- Step 2
పసుపు, పచ్చి మిర్చి ఉప్పు చేర్చి బాగా గిలకొట్టాలి.
- Step 3
తర్వాత ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా పోసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి, జీలకర్ర, మిరియాలు బాగా రుబ్బుకోవాలి.
- Step 4
బాణలిలో నూనె పోసి కాగాక దాల్చిన చెక్క, సోపు గింజలు వేసి పోపు పెట్టుకోవాలి.
- Step 5
తర్వాత ఉల్లి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేర్చి దోరగా వేపుకోవాలి. తర్వాత టమోటా చేర్చాలి.
- Step 6
బాగా వేగాక పసుపు పొడి, మిరిపపొడి, ధనియాల పొడి చేర్చి వేపాలి. కావలసినంత నీరు పోసి కాసేపు తెల్లనివ్వాలి.
- Step 7
బాగా తెల్లాక రుబ్బిన కొబ్బరిని చేర్చి కాసేపు తెల్లనివ్వాలి.
- Step 8
దించేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను కూరలో చేర్చుకోవాలి.
- Step 9
ఈ కూరలో కావాలంటే నిమ్మరసం లేదా ఒక టేబుల్ స్పూన్ చింతపండు జ్యూస్‌ను చేర్చుకోవచ్చు.
- Step 10
ఈ గ్రేవీని కొత్తిమీర, కరివేపాకు గార్నిష్‌తో దోసె, రైస్‌కు సైడిష్ సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.