- Step 1
ముందుగా శుభ్రం చేసుకున్న చేపముక్కల్ని ఓ బౌల్‌లోకి తీసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 2
తర్వాత గుడ్డును కూడా పగలగొట్టి, పచ్చసొనతో పాటు వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 3
తర్వాత అందులో చేప ముక్కలన్నింటినీ వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 4
ఇలా మసాలా పట్టించిన చేపముక్కలను అరగంట పాటు ఫ్రిజ్‌లో పెడితే మరింత టేస్ట్ ఉంటుంది.
- Step 5
అరగంట తర్వాత ఫ్రిజ్‌లో నుండి బయటకు తీసి పెట్టుకోవాలి.
- Step 6
డీప్ ఫ్రైయింగ్ పాన్‌లో నూనె వేసి, వేడయ్యీక, చేప ముక్కలను నూనెలో వేసి అతి తక్కువ మంట మీద ఇరువైపులా దోరగా వేపుకోవాలి.
- Step 7
అంతే ఫిష్ 65 రెడీ.ఈ ఫిష్ 65ని పప్పుచారుకు సైడిష్‌గానూ ఉపయోగించుకోవచ్చు.