- Step 1
ముందుగా చన్నాను రాత్రంతా నానబెట్టుకోవాలి.
- Step 2
ఉదయం శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి, కాస్త ఉప్పుతో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- Step 3
ఉడికిన చెనాలోని నీటిని గిన్నెలోకి వంపుకుని పక్కన బెట్టుకోవాలి.
- Step 4
తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నెయ్యి వేసి, అందులో ఇంగువ, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, యాలకులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒకనిముషం వేగించుకోవాలి. తర్వాత అందులోనే పసుపు, ధనియాల పొడి వేసి దోరగా వేపుకోవాలి.
- Step 5
మరొక గిన్నెలో పెరుగు, పంచదార వేసి వేసి స్పూన్‌తో బాగా గిలకొట్టాలి.
- Step 6
తర్వాత ఈ మిశ్రమాన్ని పోపు వేగుతున్న పాన్‌లో పోయాలి.
- Step 7
మంటను తగ్గించి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి.
- Step 8
ఈ మిశ్రమంలో ఉడికించి పెట్టుకొన్న శెనగలు, రుచికి సరిపడా ఉప్పు మరియు డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 9
పది నిమిషాల తర్వాత దించేస్తే చెనా కర్రీ రెడీ. ఈ కర్రీని వేడి వేడి అన్నంతో గానీ రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.