- Step 1
ముందుగా శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు ఆవగింజల పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్‌తో పాటు మ్యారినేషన్ కోసం లిస్ట్‌లో సిద్ధంగా ఉంచుకొన్నా పదార్థాలన్నింటినీ కూడా వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి.
- Step 2
అవసరమైతే కాసింత నీరు కూడా కలుపుకోవచ్చు. మ్యారినేషన్ చేసిన చికెన్ ముక్కలను గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
- Step 3
గంట తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి అందులో మస్టర్డ్ ఆయిల్ పోసి కాగాక పంచదార వేయాలి. ఇది నూనెలో పాకంలా తయారయ్యాక మంట తగ్గించాలి.
- Step 4
పంచదార కరిగే వరకూ, కలర్ బ్రౌన్ కలర్ మారే వరకూ కలియబెడుతుండాలి.
- Step 5
ఇందులో ఉల్లి ముక్కలేసి దోరగా వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు, మూడు నిముషాలు వేగించుకోవాలి.
- Step 6
తర్వాత మ్యారినేటెడ్ చికెన్ వేసి 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 7
మద్యమద్యలో కలియబెడుతుండాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, రెండు టీస్పూన్ల్ వైట్ మస్టర్డ్ పేస్ట్, ఉప్పు వేసి మరో రెండు నిముషాలు వేపాలి.
- Step 8
అందులో గోరువెచ్చని నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
- Step 9
తర్వాత పాన్‌కు మూత పెట్టి 20నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
- Step 10
చికెన్ ఉడికాక మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని వేడివేడి రైస్ లేదా రోటీలకు సైడిష్‌గా మస్టర్డ్ చికెన్ కర్రీ సర్వ్ చేయండి.