- Step 1
ముందుగా ఒక గిన్నెలో మీల్‌మేకర్స్‌ను నీటిలో నాన్చి దాన్ని పది నిమిషాల పాటు స్టౌమీద ఉడికించాలి.
- Step 2
ఆ తర్వాత గిన్నెలోని నీటిని తొలగించి మీల్‌మేకర్స్‌ను దోరగా నూనెలో వేయించుకుని పక్కన బెట్టుకోవాలి.
- Step 3
మరో బాణలిలో నూనె పోసి కాగాక, పచ్చిమిరపకాయలు సన్నని ముక్కలుగా తరుగుకొని వాటితో పాటు అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను కలుపుకోవాలి.
- Step 4
సన్నని మంటపై ఉంచి బాగా వేగాక, రెండు గ్లాసుల నీరు పోసి సోయాసాస్, వెనిగర్, అజినమోటా, ఉప్పు కలుపుకోవాలి.
- Step 5
కాసేపయ్యాక కార్న్‌ఫ్లోర్‌ను నీటితో కలిపి అందులో వేయాలి.
- Step 6
నీరు ఇంకే వరకు గరిటెతో కలియబెడుతూ ఉండాలి.
- Step 7
అలా నీరు ఇంకిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర వేసి పొడిగా వేయించి మంచూరియా తయారు చేసుకోవాలి.
- Step 8
దీంతో వేడి వేడి మీల్‌మేకర్ మంచూరియా రెడీ.