అరటిపండు గురించి ఇదివరకే వినివుంటారు. మానవ శరీరానికి కావలసిన పోషకవిలువలు, ఔషధగుణాలు అందులో పుష్కలంగా వుంటాయి. అటువంటి పండుతో కొన్నిరకాల జ్యూస్, పానీయాలను తయారుచేసుకుని తీసుకుంటే ఎంతో మంచిది. ముఖ్యంగా బనానబటర్ మిల్క్ షేక్ ఎంతో ఆరోగ్యకరమైంది. దీనిని ప్రతిరోజూ తీసుకుంటే.. రానురాను కాలక్రమంలో శరీర బరువు తగ్గుతూ వస్తుంది.
ఫలితంగా గుండెసంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి. కొలెస్టిరాల్ శాతం కూడా ఓ మోస్తరు తగ్గి, కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు. పైగా ఈ రిసిపీని తాగితే.. ఎక్కువ ఆకలిగా వుండదు. కొద్దిగా తాగితే చాలు.. పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో ఇతర ఆహార పదార్థాలు తీసుకోవాలనే ఆలోచన కలగదు. అరిటిలో అధిక ప్రోటీనుల్లు, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్స్ వుండటం వల్లే ఆకలిగా వుండదు.