- Step 1
ముందుగా కావల్సిన సైజుల్లో చికెన్ ముక్కలను కట్ చేసుకుని వాటిని నీటిలో శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి.
- Step 2
ఆ తర్వాత బాండిల్‌లో నెయ్యి వేసి.. సేమ్యాను దోరగా వేయించాలి.
- Step 3
ఆ తర్వాత జీడిపప్పులు, కిస్మిస్‌ను నేతిలో వేయించి పక్కన పెట్టండి. అలాగే, మరికాస్త నెయ్యి వేసి దానిలో లవంగాలు, యాలగలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- Step 4
అవి వేగాక ఉల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
- Step 5
ఇవన్నీ దోరగా వచ్చిన తర్వాత ఇపుడు సిద్ధం చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు, టమోటా ముక్కలు వేసి ఒకసారి కలిపి దీనిలో కారం, గరం మసాల, ఉప్పు వేసి చికెన్ మెత్తగా ఉడికే వరకు మూత వేసి ఉంచాలి.
- Step 6
ఆ తర్వాత వేయించి పెట్టుకున్న సేమ్యా వేసి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి ఉడికించాలి.
- Step 7
నీళ్ళు మొత్తం ఇగిరి పోయాక జీడిపప్పు, కిస్మిస్, సోయాబిన్ సాస్ వేసి కలిపితే సేమ్యా బిర్యానీ రెఢీ.
- Step 8
దీనికి కొత్తిమీర వేసి వడ్డిస్తే బిర్యానీ సిద్ధం.