- Step 1
మిల్క్ పనీర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే... పెద్ద పాత్రలో పాలను పోసి అరగంట సేపు మరిగించిన తర్వాత నిమ్మరసం వేయాలి.
- Step 2
అలా చేస్తే పాలు విరిగిపోతాయి (ఒక లీటరు పాలకు రెండు నిమ్మకాయల రసం వేయాల్సి ఉంటుంది). పాలు విరిగిన తరువాత నీటిని ఒంపేసి మళ్లీ స్టవ్‌పై పెట్టి మరింత నిమ్మరసం వేసి మరిగించాలి. అలా నీరు మొత్తం పోయేదాకా అడుగంటకుండా జాగ్రత్తపడుతూ వేడిచేయాలి.
- Step 3
చివరగా పాల మిశ్రమాన్ని క్లాత్‌లో కట్టి నీరు పోయేటట్లుగా చేయాలి.
- Step 4
ఆ తరువాత అది గట్టిగా తయారవుతుంది. దీన్ని రౌండ్ బాల్స్‌లాగా, చతురస్త్రాకారంగా, లేదా మనకు కావాల్సిన రీతిలో చేసుకోవచ్చు.
- Step 5
ఇలా చేసుకున్న పనీర్‌ను వండేటప్పుడు చిదమాల్సిన, తురమాల్సిన పని ఉండదు.
- Step 6
అయితే.. టిక్కాలు, స్టిక్స్ లాంటివి చేసేటప్పుడైతే... వాటి ఆకారంలో వచ్చేలాగా పనీర్‌ను కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
- Step 7
అంత టైం లేకపోతే మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ పనీర్ వాడుకోవచ్చు.
- Step 8
అయితే రెడీమేడ్ పనీర్ ప్యాక్ ఓపెన్ చేసిన తరువాత వారం రోజుల్లోపుగానే వాడేయాల్సి ఉంటుంది.