- Step 1
ముందుగా కాలీఫ్లవర్‌ను మూడు నిముషాల పాటు ఉడకబెట్టుకోవాలి.
- Step 2
ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- Step 3
కోడిగుడ్లను పగులగొట్టి వాటిలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్‌లను వేసి కలిపి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
- Step 4
బాణాలిలో నూనె వేసి కాచాలి. కాగాక మైదా మిశ్రమంలో ఉడికించన కాలీఫ్లవర్‌ను ముంచి నూనెలో వేయించి తీయాలి.
- Step 5
ఆ బాణాలిలో మిగిలి ఉన్న నూనెలో వెల్లుల్లి, అల్లం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి. ఇందులోనే సోయా సాస్ వేసి కలిపి కాసిన్ని నీరు పోసి ఉడికించాలి.
- Step 6
ఉడికిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలిపి అవసరమైతే పైన కొత్తిమీర తురుమును జల్లి దించి సర్వ్ చేయండి.