- Step 1
ముందుగా ఒక బౌల్‌లో కోడిగుడ్డును పగులగొట్టి బాగా బీట్ చేసుకోవాలి.
- Step 2
అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, మరియు అల్లం తురుము వేయాలి.
- Step 3
గుడ్డు మిశ్రమంతో పాటు, వీటన్నింటినీ బాగా గిలకొట్టాక అందులో చాట్ మసాలా వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
- Step 4
ఇలా చిక్కగా తయారైన మిశ్రమాన్ని పక్కనబెట్టుకుని.. మరో బౌల్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ప్లోర్ వేసి, కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్స్ స్లైస్‌ను తీసుకొని వాటి మీద ఒక్కో చీజ్ స్లైస్ పెట్టాలి.
- Step 5
బ్రెడ్‌కు చీజ్ రాసిన తర్వాత, దాని మీద ముందుగా మిక్స్ చేసి పెట్టుకొన్న గుడ్డు మిశ్రమాన్ని అమర్చాలి. తర్వాత చిక్కగా కలుపుకొన్న కార్న్ ఫ్లోర్‌తో బ్రెడ్ అంచులను కవర్ చేస్తూ రోల్ చేయాలి.
- Step 6
ఇలా అన్ని బ్రెడ్ స్లైస్ మరియు అన్ని చీజ్ స్లైతో అన్ని రోల్స్ చేసి సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 7
ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె రాసి వేడి చేయాలి.
- Step 8
తర్వత బ్రెడ్ రోల్స్‌ను పాన్ మీద వేసి మీడియం మంట మీద బ్రెడ్ రోల్స్ ను ఫ్రై చేసుకోవాలి.
- Step 9
గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన తర్వాత వాటిని తీసి నూనె పీల్చుకొనే పేపర్ మీద వేయాలి.
- Step 10
ఈ ఎగ్ చీజ్ రోల్స్‌ను టమోటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.