- Step 1
ముందుగా అనువైన ముక్కలతో కట్ చేసుకున్న చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఆ తర్వాత ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.
- Step 3
చికెన్ ముక్కలకు పసుపు, మసాలా పట్టించి కొద్దిగా నీరు పోసి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించాలి.
- Step 4
ఇలా ఓ పది నిమిషాలు ఉడికించాలి.
- Step 5
ఆ తర్వాత స్టౌ మీద బాండలిలో నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర వేసి వేగాక, ఉప్పు కలిపి, ఉడికిన చికెన్ ముక్కలను అందులో వేసి వేయించాలి.
- Step 6
చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దించే ముందు దనియాల పొడి, జీడిపప్పు, కొత్తిమీర చల్లాలి.
- Step 7
మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచి వుంచినట్టయితే పాలక్ చికెన్ రెడీ అయినట్టే.