- Step 1
చికెన్ బ్రెస్ట్ ముక్కలకు లెమన్ గ్రాస్, కొత్తిమీర తరుగు, పచ్చిమిరప తరుగు, చింతపండు గుజ్జు, ధనియాలపొడి, నువ్వుల నూనె, రిఫైండ్ ఆయిల్, కొబ్బరిపాలు, తగినంత ఉప్పు కలిపి ఒక గంటసేపు మారినేడ్ (అన్నింటినీ బాగా కలిపి ఉంచడం) చేసుకోవాలి.
- Step 2
తరువాత చికెన్ బ్రెస్ట్ ముక్కలను రెండు అంగుళాల పొడవుగా కోసుకోవాలి.
- Step 3
వీటిని పుల్లలకు గుచ్చి గ్రిల్ చేసుకోవాలి.
- Step 4
గ్రిల్ అందుబాటులో లేనట్లయితే... బొగ్గులపై కాల్చి, తందూరీలాగా చేసుకోవచ్చు.
- Step 5
గ్రిల్ చేసుకున్న వాటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చి తీసేయాలి... అంతే చికెన్ సాటె రెడీ అయినట్లే..! వీటిని పీనట్ సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.