- Step 1
ముందుగా పనీర్‌ను స్టిక్స్‌లా కట్ చేసుకోవాలి.
- Step 2
ఈ పన్నీర్ స్టిక్స్‌కు మైదా, అజనొమోటో, కార్న్‌ఫ్లోర్, అజనొమోటో, మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, ఫుడ్ కలర్ కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి.
- Step 3
స్టిక్స్‌కు అన్ని వైపులా మిశ్రమం కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి.
- Step 4
సరిపోలేదంటే మరో కోడిగుడ్డును కూడా వాడుకోవచ్చు.
- Step 5
ఈ మిశ్రమం పట్టంచిన స్టిక్స్‌ను ఐదు నిమిషాల ఉంచి తర్వాత స్టిక్స్‌ను నూనెలో దోరగా వేయించి పక్కనబెట్టుకోవాలి.
- Step 6
మరో బాణలిలో నూనె వేడయ్యాక నెయ్యి, వెన్న చెరో అర స్పూన్ వేయాలి.
- Step 7
వేడైన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి.
- Step 8
వేగాక నిమ్మరసం, కారం, అజనమోటో వేసి తాళింపును సమంగా కలిపి వేయించిన పనీర్ స్టిక్స్‌ను కలపాలి. అంతే పనీర్ స్టిక్స్ రెడీ..