- Step 1
ముందుగా కాకరకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో కాసేపు ఉంచాలి.
- Step 2
తర్వాత కాకర ముక్కలను వేరొక పాత్రలోకి తీసుకుని మైదా, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం చేర్చి బాగా కలిపి పావు గంట నానబెట్టాలి.
- Step 3
తర్వాత గ్యాస్ పైన బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక కాకర మిశ్రమాన్నివేసి దోరగా వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి.
- Step 4
తరువాత ఇంకో పాత్రలో నూనె పోసి పోపు గింజలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమోటా తరుగు, టమోటా సాస్, సోయాసాస్, ఉప్పు, కారం, బాగా వేపుకుని దీంతో వేయించిన కాకరను చేర్చి బాగా కలపాలి.
- Step 5
ఐదు నిమిషాల తర్వాత దించేయాలి.
- Step 6
అంతే వెరైటీ కాకరకాయ మంజూరియన్ రెడీ.