- Step 1
ముందుగా బియ్యాన్ని అరగంటపాటు నీళ్ళల్లో నానబెట్టాలి.
- Step 2
తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత గ్యాస్ మీద పాత్రపెట్టి అందులో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో పోపుగింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
- Step 3
అవి వేగాక బియ్యం వేసి కలియబెట్టాలి.
- Step 4
కొద్దిసేపు తరువాత అందులో మామిడిపండు గుజ్జు, కాస్త ఉప్పు వేసి, సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టాలి.
- Step 5
అన్నం ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసి, నెయ్యిలో వేయించిన జీడిపప్పును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
- Step 6
అంతే నోరూరించే మ్యాంగో పులావ్ రెడీ.