- Step 1
కోడిగుడ్లలోని సొనను ఒక పాత్రలోకి తీసుకుని బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
పాన్‌లో నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి.
- Step 3
అందులో ఉల్లిపాయ ముక్కలూ, వెల్లుల్లి తరుగు వేయాలి.
- Step 4
అవి వేగాక పుట్టగొడుగు ముక్కలు, కోడిగుడ్ల మిశ్రమం వేసి కాసేపు వేయించాలి.
- Step 5
తర్వాత పాలకూర తరుగూ, ఉప్పూ వేయాలి.
- Step 6
2 నిమిషాలయ్యాక కొత్తిమీర తరుగూ, మిరియాల పొడీ వేసి దించేయాలి.
- Step 7
ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని దాని మీద వెన్న రాసుకోవాలి.
- Step 8
తర్వాత పాలకూర మిశ్రమాన్ని పూతలా రాయాలి. ఆపైన చీజ్ తరుగూ పరిచి మధ్యకు మడవాలి.
- Step 9
ఇప్పుడు పాన్‌ను పొయ్యి మీద పెట్టి స్టఫ్ చేసిన చపాతీని మళ్లీ పొయ్యిమీద ఉంచి... మిగిలిన నూనె వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి.
- Step 10
తర్వాత కావాలనుకుంటే వీటిని ముక్కలుగానూ కోసుకోవచ్చు. అంతే మష్రూమ్ ఎగ్ సిద్ధమైనట్టే.