చేపలు తింటే శరీర ఆరోగ్యానికి ఎంతో మేలని అందరికీ తెలిసిన విషయమే! కాబట్టి.. వీటిని రకరకాల వంటకాల్లో వండి తింటే చాలా మంచిది. చేపలతో చేసే ప్రత్యేకమైన వంటకాల్లో బట్టర్ గార్లిక్ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. దీనిని చాలా సింపుల్’గా, తక్కువ సమయంలోనే టేస్టీగా వండుకుని తినొచ్చు. చందువా ఫిష్ పిల్లెనుట్’ను బట్టర్’తో మ్యారినేట్ చేసి, ఫ్రై చేస్తే చాలు.. రిసిపీ తయారైపోతుంది.
ఈ రిసిపీ బెంగాల్’లో ఎంతో పాపులర్ అయింది. దాదాపుగా దీన్ని కేవలం ఫెస్టివల్స్, శుభకార్యాలు జరుగుతున్నప్పుడే ఎక్కువగా తయారుచేస్తారు. ఆయా సమయాల్లో వంటకార్యక్రమాలు త్వరగా నిర్వహించడంలో ఈ ఫ్రైను త్వరగా ముగించేయొచ్చు కాబట్టి దీనిమీదే ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక ఆరోగ్యానికి ఎలాగో మంచిది కాబట్టి.. ప్రతిఒక్కరు దీన్ని తినేందుకు ఎంతగానో ఇష్టపడతారు. మరి ఈ ఫ్రైని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...