- Step 1
వేడిచేసిన ప్యాన్ లో నాలుగు కప్పుల నీటిని జోడించండి.
- Step 2
దాదాపు 2 నిమిషాల వరకు నీటిని మరగనివ్వండి. ఇప్పుడు బాదాం పప్పులను జోడించి ఒక లిడ్ తో ప్యాన్ ను కవర్ చేయండి.
- Step 3
హై ఫ్లేమ్ లో దాదాపు 8 నుంచి పది నిమిషాల వరకు ఇలా కుక్ చేయండి.
- Step 4
బాదం సరిగ్గా ఉడికిందో లేదో చెక్ చేయండి. ఇందుకు, ఒక బాదంను తీసుకుని బాదం చెక్కు సులభంగా వచ్చిందో లేదో చూడండి. ఒకవేళ బాదం చెక్కు సులభంగా వస్తే బాదాం సరిగ్గా ఉడికినట్టేనని అర్థం.
- Step 5
స్టవ్ పైనుంచి ప్యాన్ ను తీసుకుని అందులోనున్న ప్యాన్ లో నున్నవాటిని ఒక బౌల్ లోకి బదిలీ చేయండి. ఆ తరువాత, అయిదు నిమిషాల వరకు ఆ బౌల్ లోని పదార్థాలని చల్లబడనివ్వండి.
- Step 6
ఇప్పుడు, ఇంకొక బౌల్ లో ఒక కప్పుడు నీటిని తీసుకోండి. బాదంని ప్రెస్ చేసి బాదం చెక్కులను తొలగించండి. ఇలా చేయడం ద్వారా బాదం చెక్కులను త్వరగా తొలగించవచ్చు.
- Step 7
బాదం చెక్కులను తొలగించిన తరువాత బాదం పప్పులను వేరొక బౌల్ లోకి బదిలీ చేయండి.
- Step 8
ఇప్పుడు, బాదంలను ఒక మిక్సర్ జార్ లోకి తీసుకోండి. ఒక పావు కప్పుడు నీటిని జోడించి, బాదం పప్పులను చక్కటి పేస్ట్ లా నూరుకోండి. ఇప్పుడు, ఈ పేస్ట్ ని ఒక పక్కన పెట్టుకోండి.
- Step 9
వేడిచేసిన ప్యాన్ లో ఒక పావు కప్పుడు నీటిని తీసుకోండి.
- Step 10
ఇప్పుడు, చక్కెరని జోడించి బాగా కలపండి. చక్కెర కరిగిపోయేవరకు బాగా కలపండి. ఇందులో, కుంకుమ పువ్వు పోగులను జోడించండి.
- Step 11
ఒక నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని మరగనివ్వండి. ఆ తరువాత, లో ఫ్లేమ్ కి మార్చండి. మరొక వేడిచేసిన ప్యాన్ లో నేతిని పోయండి. నేయి కరగగానే, బాదం పేస్ట్ ను జోడించండి.
- Step 12
దాదాపు 8 నుంచి పదినిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి. ఈ మిశ్రమం అనేది గ్రాన్యులర్ కన్సిస్టెన్సీ కి వచ్చేవరకు ఇలా కలుపుతూనే ఉండాలి 19. ఇప్పుడు, చక్కెర పాకాన్ని వేసి దాదాపు రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి. నేయి అనేది సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి.
- Step 13
ఇప్పుడు, స్టవ్ మీద నుంచి ప్యాన్ ను తీసుకుని అందులోని హల్వాను ఒక బౌల్ లోకి మార్చండి.
- Step 14
రూమ్ టెంపరేచర్ లో గాని లేదా చల్లగా గానీ బాదం హల్వాని వడ్డించుకోవచ్చు.