- Step 1
టమోటాలు తీసుకోని టమోటా పై భాగంలో కట్ చేయాలి.
- Step 2
టమోటాకు మూడు నిలువు గాట్లు పెట్టాలి. టమోటాలను హెవీ హీటెడ్ పాన్ లో వేయాలి.
- Step 3
దానిలో నీరు పోసి 15 నిమిషాల పాటు మృదువుగా మారే వరకు ఉడికించాలి. టమోటాలను బౌల్ లోకి తీసుకోవాలి. పాన్ లో నీటిని తరవాత ఉపయోగించాలి.
- Step 4
టమోటాలను 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి టమోటాల తొక్క తీసేసి కొంచెం మాష్ చేసి పక్కన పెట్టాలి.
- Step 5
సనికిలిలో వెల్లుల్లి వేయాలి దానిలో ఒక స్పూన్ మిరియాలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. రోకలితో కచ్చా పచ్ఛాగా నూరాలి.
- Step 6
పాన్ లో నీటిని రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. దానిలో టమోటా గుజ్జు మరియు నూరిన వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
- Step 7
ఉప్పు మరియు చింతపండు వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. రసం పొడి కలపాలి.
- Step 8
రసంను బౌల్ లోకి తీసుకోవాలి. తాలింపు పాన్ పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.
- Step 9
దానిలో ఆవాలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. ఆ తర్వాత ఇంగువ,కరివేపాకు వేయాలి.
- Step 10
బాగా వేగనివ్వాలి వేగిన తాలింపును రసంలో పోయాలి తరిగిన కొత్తిమీర కలపాలి నెయ్యి కలపాలి ఒక బౌల్ లోకి రసంను తీసుకోని అన్నంలోకి సర్వ్ చేయాలి.