- Step 1
మొదటగా పేస్ట్ ను తయారుచేసుకోండి.
- Step 2
పేస్ట్ తయారీకి కావలసిన పదార్థాలని ఫుడ్ ప్రాసెసర్ లో వేసి వాటిని మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోండి.
- Step 3
ఇప్పుడు వీటిని చిన్న పాత్రలోకి తీసుకుని ఓ పక్కన ఉంచండి. ఇప్పుడు ఓట్స్ ని నానబెట్టిన నీటితో పాటు ఓట్స్ ని కూడా ఫుడ్ ప్రాసెసర్ లో పెట్టి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.
- Step 4
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టండి. వీటిలో క్రీమ్డ్ కొబ్బరిని కలిపి ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు, పెద్ద నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ఫ్యాన్ ను తీసుకుని హై హీట్ లో ఉంచండి. వీటిలో కొబ్బరినూనెను వేసి ఆ తరువాత కేరట్, ముల్లంగి మరియు స్వీట్ పొటాటోను జతచేయండి.
- Step 5
దాదాపు 2 నుంచి మూడు నిమిషాల వరకు వీటిని కాస్తంత ఫ్రై చేయండి. కూరగాయల చివర్లలో రంగు మారేవరకు వీటిని వేచాలి.
- Step 6
ఇప్పుడు కర్రీ పేస్ట్ ను జోడించి కర్రీలోని నీరు ఇంకిపోయే వరకు కుక్ చేయండి. ఓట్ మిల్క్ తో పాటు కొబ్బరి మిశ్రమాన్ని, మర్మైట్, నిమ్మ ఆకులూ అలాగే 300 గ్రాముల నీటిని వీటిలో జోడించి బాగా మరగబెట్టండి.
- Step 7
ఇప్పుడు ప్యాన్ ను కవర్ చేసి 15 నిమిషాల వరకు కుక్ చేయండి. ఇప్పుడు, బ్రొకోలీని అలాగే 50 మిల్లీ లీటర్ల నీటిని ఇందులో కలపండి.
- Step 8
మరొక అయిదు నిమిషాల పాటు కుక్ చేయండి. ఆ తరువాత, ఫ్రోజెన్ బఠాణీలను జోడించి ఒక నిమిషం పాటు కుక్ చేయండి ఇప్పుడు, ప్యాన్ ను స్టవ్ పై నుంచితొలగించి, రెండు నిమ్మ చెక్కల నుంచి ఇందులోకి రసాన్ని పిండండి బ్రౌన్ రైస్ తో వెంటనే వడ్డించండి.
- Step 9
మీకు నచ్చితే మిగిలిన నిమ్మ చెక్కల రసాన్ని కూడా ఇందులో పిండండి. ఆలాగే, కొత్తమీరను చల్లుకోండి.