- Step 1
మొదట ఒక పాన్ ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనెని జతచేసి వేడిచేయండి.
- Step 2
ఇప్పుడు తరివుంచిన ఉల్లిపాయలను జోడించండి వాటిని బంగారు గోధుమ రంగులోకి మారేంతవరకు వేయించండి.
- Step 3
ఇప్పుడు కట్ చేసుకొని సిద్ధంగా ఉంచిన టమోటాలను జోడించండి మరియు ఒక నిమిషం పాటు బాగా కలపండి దానికి తురుముకున్న అల్లం మరియు 4 వెల్లుల్లి పాయలను కలపండి.
- Step 4
ముందే తరిగిన మిరపకాయలను వేసి, ఒక నిమిషం పాటు బాగా కలపండి టమోటాలు చర్మం ఊడిపోవడం ప్రారంభమవుతుంది.
- Step 5
ఇప్పుడు దీనిని 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి ఇంతలోపు, శుభ్రంగా కడిగిన 3 బంగాళాదుంపలను తీసుకొని పైన వున్న తొక్కుని తొలగించండి.
- Step 6
అంతేకాక, వాటిని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ ల కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని పైన వేయించి ఉంచిన టమేటా మిశ్రమాన్ని నింపండి.
- Step 7
ఒక మృదువైన పేస్ట్ వచ్చేదాకా దీనిని గ్రైండ్ చేసుకొని దానిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు, 2½ టేబుల్ స్పూన్ల నూనెను ఒక వంట పాత్రలో తీసుకొని వేడి చేయండి.
- Step 8
దానికి జీరాని కూడా జోడించి కాసేపు వేడి అవడానికి అనుమతించండి. ఈ మిశ్రమానికి ఇందాక కట్ చేసుకొని ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలపండి. దీనిని
కొన్ని నిముషాల పాటు ఉడికించనివ్వండి. కాసేపటి తరువాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి ఇప్పుడు ఉప్పు మరియు పసుపు పొడిని కూడా జత చేయండి.
- Step 9
తరువాత ఎర్ర కారం పొడి మరియు ధనియ పొడి మిగిలిన మసాలాలు జతచేసి బాగా కలపండి. ఆకుపచ్చ బటానీలను వేసి మళ్లీ కలపాలి.
- Step 10
ఇంకా, ఒక కప్పు నీటిని కలపండి. మూత మూసివేయండి మరియు 3 విజిల్స్ వరకు ఉడికించండి.
- Step 11
3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ని ఆపేసి, ప్రెషర్ తగ్గేవరకూ ఉండనివ్వండి ఇప్పుడు, మూత తెరిచి గరం మసాలా మరియు జీరా పొడిని దానిపై చల్లండి.
- Step 12
చివరగా, కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయండి వేడి వేడి గా సర్వ్ చేసుకోండి.