- Step 1
ఒక పెద్ద గిన్నె తీసుకుని, అల్లం, వెల్లుల్లి పేస్టును దానిలో వేయండి ఒక చెంచా ఎర్రకారం వేయండి.
- Step 2
అరచెంచా మిరియాల పొడి, రుచికి ఉప్పును వేయండి. ఇప్పుడు 1 కప్పు తరిగిన కొత్తిమీరను వేసి, నిమ్మరసం పిండండి.
- Step 3
బాగా కలిపి తరిగిన పన్నీర్ ముక్కలు వేయండి. మిశ్రమం మొత్తం బాగా కలిసేట్టు 30 నిమిషాలు అలా నాననివ్వండి.
- Step 4
నాలుగు బ్రెడ్ ముక్కలను తీసి మిక్సీలో క్రంబ్స్ లాగా ముక్కలు చేయండి. ఈ బ్రెడ్ క్రంబ్స్ ను వేడిచేసిన నూనె ఉన్న పెనంలో వేయండి.
- Step 5
3నుంచి 4 నిమిషాలు తక్కువ మంటపై ఉంచి, బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా కలపండి. ప్లేట్లోకి తీసుకుని, మాములు గది ఉష్ణోగ్రతలోనే చల్లబడనివ్వండి.
- Step 6
ఇప్పుడు, మీడియం సైజు గిన్నె తీసుకుని అరకప్పు మొక్కజొన్న పిండిని వేయండి. 2 చెంచాల మైదాను వేసి, అరచెంచా మిరియాల పొడిని వేయండి.
- Step 7
చిటికెడు ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి, గడ్డలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు మెరినేటడ్ పన్నీర్ ముక్కలు తీసుకుని, ఈ మిశ్రమంలో ముంచండి.
- Step 8
తర్వాత ఈ ముక్కలను బ్రెడ్ క్రంబ్స్ పొడిపై దొర్లించి, నూనెలో వేయండి. బంగారు బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగనివ్వండి.
- Step 9
బంగారు రంగులోకి మారాక, నూనె నుంచి తీసేసి టమాటా కెచప్ తో వేడివేడిగా వడ్డించండి.