- Step 1
ఒక బౌల్ తీసుకుని బియ్యం వేయండి నీళ్ళు పోసి బాగా కడగండి కుక్కర్ తీసుకుని ఆ బియ్యాన్ని అందులో వేయండి నీరు పోయండి.
- Step 2
3 విజిల్స్ ఒచ్చాక కుక్కర్ ఆపండి అన్నాన్ని ఒక పక్కన పెట్టుకోండి వంకాయలు తీసుకుని సన్నగా ముక్కలు తరగండి.
- Step 3
అన్ని ముక్కలను ఒక బౌల్ నీళ్లలో వేయండి ఒక పెనం తీసుకోండి నూనె వేయండి మినప్పప్పు,జీలకర్ర, సెనగపప్పు, నువ్వులు, మెంతులు, లవంగాలు, ధనియాలను వేయండి.
- Step 4
అన్నిటినీ కలపండి ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి వేసి మళ్ళీ కలపండి కొబ్బరి మరియు ఇతర దినుసుల వాసన తెలిసేదాకా పొడిగా అన్నిటినీ వేయించండి.
- Step 5
3-4 నిమిషాలపాటు చల్లబడనివ్వండి అన్ని దినుసులను మిక్సీలో వేయండి పొడి అయ్యేవరకూ మిక్సీ పట్టండి పెనం తీసుకోండి.
- Step 6
నూనె, ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, కరివేపాకు, పసుపు, వంకాయలు వేసి నిమిషంపాటు కలపండి.
- Step 7
చింతపండు రసం,బెల్లం వేసి బాగా కలపండి ఉప్పు వేయండి అన్నిటినీ కలిపి 2-3 నిమిషాలు ఉడకనివ్వండి దినుసుల మిశ్రమాన్ని వేసి బాగా అన్నిటినీ కలపండి.
- Step 8
మూతపెట్టి 2-3 నిమిషాలను ఉడకనివ్వండి మూత తీసి వంకాయలను కలపండి అన్నం వేసి బాగా కలపండి కొత్తిమీరతో అలంకరించి బౌల్ లోకి తీసుకోండి మీకు నచ్చిన పచ్చడి లేదా పెరుగుతో వడ్డించండి.