వెజిటేబుల్స్’తో తయారుచేసే గోబీ ఫ్రైడ్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బయట ఫుడ్ తినడం కంటే ఇంట్లోనే తయారుచేసుకొని తినడం ఎంతో శ్రేయస్కరం. ఈ రైస్’లో కాలీఫ్లవర్’తోపాటు ఇతర గ్రీన్ వెజిటేబుల్స్ ఎన్నో వుంటాయి. ఇక వెజిటేబుల్స్’లో ఎన్నో పోషకవిలువలు, ఔషధగుణాలు, ఖనిజాలు, ఐరన్ వంటివి ఆరోగ్యకరమైన లక్షణాలు వుంటాయని అందరికీ తెలిసిందే! ఇన్ని లక్షణాలతో కూడిన ఈ రైస్ మిశ్రమాన్ని తీసుకుంటే.. ఎన్నో రోగాల నుంచి దూరంగా వుండటంతోబాటు ఎంతో బలంగా వుండొచ్చు.
కాలీ ఫ్లవర్ర’లో విటమిన్ సి, లోఫ్యాట్, క్యాన్సర్’తో పోరాడే ఇతర లక్షణాలతోబాటు అధిక మోతాదులో ఫైబర్ కూడా పుష్కలంగా వుంటుంది. ఇక గ్రీన్ వెజిటేబుల్స్’లో కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలు చాలావరకు వుంటాయి. ఈ రెండింటి కాంబినేషన్’తో తయారయ్యే ఈ రైస్ ఎంతటి ఆరోగ్యకరమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే బయట చేసే గోబీ రైస్ కంటే ఇంట్లో చేసుకుంటేనే ఎంతో ఆరోగ్యకరం, శ్రేయస్కరం. మరి ఈ రైస్’ను ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...