- Step 1
ఒక ఉల్లిపాయ తీసుకుని, పైన కింద కోయండి పైన తొక్క తీసేసి సగానికి కోయండి.
- Step 2
మీకు కావాలంటే పైన గట్టిగా ఉండే భాగాన్ని తీసేయండి. నిలువుగా ఉల్లిపాయ ముక్కలు కోయండి పచ్చిమిరపకాయను నిలువుగా సగానికి కోయండి.
- Step 3
ఇంకా,2 అంగుళాల ముక్కలుగా కోయండి. పక్కన పెట్టుకోండి వేడిచేసిన పెనంలో నూనెను వేయండి.
- Step 4
నిలువుగా కోసిన ఉల్లిపాయలను వేసి నెరపండి గోధుమరంగులోకి మారేదాకా వేయించండి.
- Step 5
కోసిన పచ్చిమిర్చిని వేయండి అల్లం వెల్లుల్లి పేస్టును చెంచా ఉప్పుతో కలిపి వేయండి.
- Step 6
బాగా కలపండి తర్వాత, గుడ్లను చాకుతో పగలకొట్టి, ఒకదాని తర్వాత ఒకటి పెనంలో వేయండి.
- Step 7
ఒకటిన్నర చెంచాల ఉప్పును వేయండి చెంచాడు జీలకర్ర మరియు మిరియాల పొడిని వేయండి.
- Step 8
ఇప్పుడు గుడ్లను గిలకొట్టి, గరిటెతో పచ్చిగుడ్లు గట్టిపడేదాకా కలపండి 6-7 నిమిషాలు అలానే మంటపై ఉడకనిచ్చి, భుర్జీ బంగారు రంగులోకి మారేదాకా ఉంచండి.
- Step 9
కొత్తిమీరతో అలంకరించండి గిన్నెలోకి తీసి వడ్డించండి.