- Step 1
బేకింగ్ ట్రే ను తీసుకోండి ఫిలో షీట్స్ ను తెరవండి బేకింగ్ ట్రే పైన ఫిలో షీట్స్ ను పరవండి. బేకింగ్ ట్రే పైన పరిచిన ఫిలో షీట్స్ పై నెయ్యిని అద్దండి ఫ్రెష్ బౌల్ ని తీసుకుని మిల్క్ కేక్ ని పొడిలా చేయండి.
- Step 2
ఇప్పుడు పిస్తాపప్పు పొడి ని ఆ బౌల్ లో జోడించండి. ఈ రెండిటిని బాగా కలపండి ఇప్పుడు, ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని తీసుకుని బేకింగ్ ట్రే పైన అమర్చబడిన ఫిలో షీట్ పైన పరవండి.
- Step 3
మళ్ళీ, ఫిలో షీట్ పై నేతిని అద్దండి. ఇప్పుడు, పొడిగా చేసుకున్న మిల్క్ కేక్ ని అలాగే పిస్తాపప్పు పొడిని ఒక లేయర్ లా పరవండి. మరొక ఫిలో షీట్ తో వీటిని కవర్ చేయండి.
- Step 4
పైన చెప్పిన స్టెప్స్ ని 10 షీట్స్ ల మిశ్రమం వచ్చే వరకు పాటించండి 10 వ షీట్ వద్దకు రాగానే, పేస్ట్రీని సమానంగా ప్రెస్ చేయండి.
- Step 5
ఫిలో షీట్ పైన నెయ్యిని అద్దండి ఈ ట్రే ను 1 గంటపాటు రెఫ్రిజిరేట్ చేయండి. ఒక గంట తరువాత రిఫ్రిజిరేటర్ లోంచి ఈ ట్రేను తీసి సాధారణ టెంపరేచర్ కు వచ్చే వరకు ఒక పక్కన ఉంచండి ఒక గంట తరువాత, ట్రేలో నున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరగండి ఇప్పుడు, ఈ బేకింగ్ ట్రేను ఓవెన్ లో పెట్టి 20 నిమిషాలపాటు 180 డిగ్రీల సెంటీగ్రేడ్ లో బేక్ చేయండి.
- Step 6
ఈలోగా, ప్యాన్ ను హై ఫ్లేమ్ లో ఉంచండి ప్యాన్ లో పంచదారను వేయండి. ఇప్పుడు, ప్యాన్ లోకి నీళ్లను జోడించండి. తీగ పాకం వచ్చేవరకు పంచదారని పాకం పట్టండి. ఇప్పుడు ఓవెన్ లోంచి ట్రే ని బయటకు తీయండి. బేక్ చేయబడిన ఈ మిశ్రమాన్ని బక్లావా అనంటారు.
- Step 7
ఈ బక్లావాపై మనం తయారుచేసుకున్న పంచదార పాకాన్ని పోయండి. ఇప్పుడు, ట్రేలో బ్యాక్లావా కేక్ లను విడదీయండి. రూమ్ టెంపరేచర్ లో ఈ బక్లావా కేక్ ను సర్వ్ చేయండి.