- Step 1
పన్నా కాటా కోసం, జెలటిన్ ఒక చిన్న గిన్నెలో తీసుకొని సుమారు 5 నిముషాల పాటు నానబెట్టాలి. ఈలోపు ఒక ఒక పాన్ తీసుకొని క్రీమ్, పాలు మరియు చక్కెర పోయాలి.
- Step 2
వనిల్లా పాడ్ ని ఒలిచి దానిలోని గింజలను తొలగించండి. పైన పాన్ లో తీసుకున్న క్రీం తో వనిల్లా పాడ్ ని కలపండి.
- Step 3
వేడి అయేంతవరకు ఉంచండి, కానీ ఉడికించకూడదు. ఇప్పడు ముందుగా నానబెట్టిన నీటి నుండి జెలటిన్ ఆకులను తొలగించండి.
- Step 4
ఆకులలో నీటిని పుర్తిగా తొలగించేదాకా పట్టుకొని,ఒకేసారి హాట్ క్రీం తో కలపండి. పూర్తిగా కరిగిపోయే వరకు తిప్పుతూ, 20-30 నిముషాలు ఉంచండి.
- Step 5
చల్లబడిన తరువాత ద్రవంలో నుండి వెనిలా ప్యాడ్లు తొలగించండి. ఈ మొత్తం మిశ్రమాన్ని మిశ్రమాన్ని 6 మాములు గ్లాసుల్లోకి వంచుకొని,దీనిని కనీసం 3 గంటల పాటు చల్లార్చాలి.
- Step 6
ఒక సాస్ పాన్ తీసుకొని మొక్కజొన్న పిండి మరియు చక్కెర, స్ట్రాబెర్రీ తో కలపండి మీడియం మంటలో ఉంచుకొని 4-5 నిముషాల పాటు ఉడికించండి. స్ట్రాబెర్రీస్ సాఫ్టుగా అయేంతవరకు మరియు వాటినుండి చిక్కటి రసం వచ్చేదాకా ఉడికించాలి. ఇప్పడు దీనిని దించేసి పక్కన పెట్టి కాస్సేపు చల్లారనివ్వండి.
- Step 7
పూర్తిగా చల్లబడిన తరువాత, స్ట్రాబెర్రీ మిశ్రమంతో కూడిన సెట్ పన్నా ని పైన నింపండి. సర్వ్ చేసేంతవరకు ఓపికగా వెయిట్ చేయండి.