- Step 1
పెద్ద బాండీలో వెన్నను వేడిచేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకూ 8-10నిమిషాలు వేయించండి.
- Step 2
బెకాన్ మరియు పుట్టగొడుగులను వేసి, గోధుమరంగులోకి మారేదాకా వండండి. సీమకోడి మాంసాన్ని చెక్క గరిటెతో ముక్కలు చేస్తూ వేయండి.
- Step 3
గోధుమరంగులోకి మారేదాకా 5 నిమిషాల పాటు ఉడికించండి. మైదాపిండిని వేసి, 1 నిముషం కలపండి.
- Step 4
తర్వాత చికెన్ స్టాకును, థైమ్ ను వేయండి. బాగా కలిపి, మధ్య మంటపై 1-2 నిమిషాలు ఉంచి గట్టిపడేదాకా ఉడికించండి.
- Step 5
రుచికి కావాల్సినట్టు చేసుకుని, 10-15 నిమిషాలు పక్కనబెట్టి చల్లబడనివ్వండి. ఓవెన్ ను 220సి/220 సి ఫ్యాన్/గ్యాస్ 7 వేడి చేయండి.
- Step 6
చల్లబడ్డాక, టర్కీ మిశ్రమాన్ని 2 రామెకిన్స్ లేదా చిన్న పై డిష్ లలో భాగాలు చేయండి. పేస్ట్రీని విడదీసి, 2 చతురస్రాలుగా కట్ చేసి పైన పెట్టండి. డిష్ చివర్లను వత్తి, గుడ్డుసొనతో అతికించండి. ఓవెన్ లో 30 నిమిషాలు బేక్ చేసి గోధుమరంగులోకి మారేదాకా వండండి.
- Step 7
విల్టెడ్ స్ప్రింగ్ గ్రీన్స్ తో అలంకరించి వడ్డించండి.