- Step 1
అన్నంని కుక్కరు లో వేయాలి. దానికి పెసర పప్పు కలిపి, తక్కువ సెగలో వేయించాలి.
- Step 2
దానికి ఆరు కప్పుల నీళ్ళు కలపాలి. ఒకసారి మొత్తం కలిపి, మూత పెట్టలి.
- Step 3
4-5 విజిల్స్ దాకా కుక్కర్లో ఉండనివ్వాలి. కొంచెం నెయ్యి ఒక మూకుడు లో వేసుకోవాలి.
- Step 4
అది మొత్తం కరిగే దాకా కరగనివ్వాలి. దానిలో జీలకర్ర మరియు కరివేపాకు వేయాలి.
- Step 5
దానికి తురిమిన అల్లం మరియు కోసిన పచ్చి మిరపకాయలు కలపాలి. అన్నీ వేశాక బాగా కలపాలి.
- Step 6
మిరియాల పొడి మరియు జీడిపప్పులు వేయాలి. తరువాత, దానికి పసుపు వేసి కలపాలి. దానిలో వండిన అన్నం మరియు పప్పు యొక్క మిశ్రమ్మాన్ని వేసి కలపాలి.
- Step 7
ఒక కప్పు నీళ్ళు పోసి , అన్ని పదార్థాలు బాగా కలిసే దాక కలపాలి. దానిని ఒక 5 నిమిషాలు వండనివ్వాలి.
- Step 8
అందులో కోసిన కొత్తిమీర వేసి కలపాలి. చివరిగా తగినంత ఉప్పు వేసి కలపాలి. మూకుడు లో నుంచి తీసి ఒక గిన్నె లో వేసుకోవాలి. ఆ తరువాత వేడిగా వడ్డించుకోవాలి.