- Step 1
పెద్ద గిన్నెలో మైదాపిండిని తీసుకుని, 3 చెంచాల నెయ్యిని కలపండి. బాగాకలిపి పావు కప్పు నీళ్ళు కొంచెం కొంచెంగా పోస్తూ, గట్టి ముద్దలాగా కలపండి.
- Step 2
2-3చుక్కల నెయ్యిని వేసి మళ్ళీ కలపండి. తడి గుడ్డను ఆ పిండిముద్దపై కప్పి అరగంట సేపు నాననివ్వండి. అదే సమయంలో రవ్వను వేడి కడాయిలో పోసి, పొడిగా వేయించండి. గోధుమరంగులోకి మారాక ,పక్కకి తీసి ఉంచి చల్లబడనివ్వండి.
- Step 3
తర్వాత వేడి కడాయిలో ఎండుకొబ్బరిని కూడా వేయండి. అరచెంచా నెయ్యిని వేసి బాగా కలపండి. మాడిపోకుండా కలుపుతూ గట్టిపడేదాకా ఉంచండి. స్టవ్ పై నుంచి తీసేసి చల్లబడనివ్వండి. వేడిపెనంలో చెంచాడు నెయ్యి వేసి వేడెక్కనివ్వండి జీడిపప్పులు, బాదం, కిస్మిస్ లను వేయండి.
- Step 4
అవన్నీ వేగేదాకా బాగా కలపండి. స్టవ్ పై నుండి తీసేసి సరిగ్గా చల్లబడనివ్వండి. చల్లబడిన ఎండుకొబ్బరిని గిన్నెలో తీసుకుని, వేయించిన రవ్వను కలపండి. వాటికి వేయించిన డ్రైఫ్రూట్లను, ఏలకుల పొడిని కలపండి. పంచదారపొడిని కూడా వేసి అన్నిటినీ బాగా కలపండి.
- Step 5
చేతికి కొంచెం నూనె రాసుకుని జిడ్డు చేసుకోండి. కొంచెం పిండి ముద్దను తీసుకుని, చేతితో ఉండలు చేసి దాన్ని వత్తండి. అప్పడాల కర్రతో పూరీల్లాగా వాటిని వత్తండి. గుజియా లేదా కజ్జికాయ అచ్చును ఈ లోపల నూనె రాసి జిడ్డుచేయండి. ఈ వత్తిన పూరీలాంటి పిండిని ఆ అచ్చులో పెట్టండి.
- Step 6
ఎండుకొబ్బరి మిశ్రమాన్ని దాని లోపల పెట్టి అన్నివైపులా పిండి అతుక్కోడానికి నీటిని రాయండి. అచ్చును మూసేసి అన్నివైపులా వత్తండి. బయటకి వచ్చిన మిగిలిన పిండిని తీసేయండి. అన్నివైపులా సరిగ్గా వత్తి, అచ్చును జాగ్రత్తగా తెరచి కజ్జికాయను బయటకి తీయండి.
- Step 7
దాన్ని గుడ్డతో కప్పండి. అదే సమయంలో బాండీలో నూనెను మధ్యమంటతో కాగనివ్వండి. నూనె సరియైన స్థాయిలో మరిగిందో లేదో చూడటానికి కొంచెం పిండిని వేసి చూడవచ్చు. అది వెంటనే పైకి తేలితే నూనె కాగినట్టు. కొన్ని కజ్జికాయలను నూనెలో మెల్లగా వేయించటానికి వేయండి.
- Step 8
అవి బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేగనివ్వండి, వెనక్కి తిప్పి కూడా వేయించండి. (ఒక్కో కజ్జికాయ వేగటానికి 10-15నిమిషాల సమయం పడుతుంది.) వేగాక, పళ్ళెంలోకి తీసుకోండి.