మాంసాహార వంటకమైన చికెన్’తో ఎన్నోరకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. అలాంటివాటిల్లో చికెన్ సలాడ్ కూడా ఒకటి! ఇది ఎంతో టేస్టీగా వుండే లోఫ్యాట్ రిసిపీ! ఈ రిసిపీని రకరకాల డిష్’లతో తయారుచేస్తారు. ఎక్కువ పదార్థాలు జోడించినప్పటికీ తక్కువ సమయంలోనే దీని తయారీని ముగించేయొచ్చు.
ఈ రిసిపీలో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది తక్కువ ఫ్యాట్ కంటెంట్’తోబాటు అధిక పోషక విలువలను కలిగి వుంటుంది. దీనిని వారానికి మూడుసార్లు తీసుకుంటే.. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కండరాలు బలమవుతాయి. ఎముకలు బలిష్టంగా తయారవుతాయి. టేస్టీతోబాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
కాబట్టి.. ఇటువంటి రెసిపీలమీదే ఎక్కువ ఆసక్తి కనబరిస్తే.. రుచితోబాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ రిసిపీ చాలావరకు రెస్టారెంట్లు, హోటళ్లలోనే ఎక్కువగా లభ్యమవుతాయి. ఇళ్లలో కూడా వీటిని తయారుచేసుకోవచ్చు. పైగా దీనిని చేయడం ఎంతో సులభం. మరి ఎలా చేస్తారో తెలుసుకుందాం...