- Step 1
రవ్వ, మైదా, చిటికెడు పసుపును కలపండి బాగా కలపండి. కొంచెం కొంచెంగా ¾ కప్పు నీళ్ళు పోస్తూ పిండి ముద్దలా కలుపుకోండి. 2 చెంచాల నూనె వేసి తిరిగి కలపండి.
- Step 2
మరో 3 చెంచాల నూనె వేసి ఆ పిండి ముద్దపై పూతలా చేయండి 4-5 గంటలు అలా నాననివ్వండి. అదే సమయంలో కుక్కర్ లో కందిపప్పును తీసుకోండి. కప్పుల నీళ్ళు పోసి, చిటికెడు పసుపు వేయండి.
- Step 3
నాలుగు విజిల్ కూతలు వచ్చే వరకూ కుక్కర్ ను ఉడకనివ్వండి, తర్వాత చల్లబడనివ్వండి. అదే సమయంలో , బెల్లాన్ని వేడిపెనంలో వేయండి పావు కప్పు నీళ్ళు పోయండి బెల్లం కరిగి పాకంలా అయ్యేవరకు ఉడకనివ్వండి.
- Step 4
అదే సమయంలో ఉడికిన పప్పులో అధిక నీరు తీసేసి, పప్పును మిక్సిలో వేయండి. కొబ్బరికోరును, ఏలకులను వేసి మిక్సీలో అన్నిటినీ తిప్పండి. బెల్లం పాకం తయారయ్యాక, ఈ మిక్సీ పొడిని పెనంలో వేయండి.
- Step 5
ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండండి. మిశ్రమం పక్కల నుండి బయటకి వస్తూ, మధ్యలో ముద్దగా మారుతూ ఉంటుంది. బాగా చల్లబడనివ్వండి. మధ్యసైజులో లడ్డూలలాగా చేతిలో ముద్దలు చేసుకోండి.
- Step 6
తర్వాత ప్లాస్టిక్ షీటు మీద నూనెతో జిడ్డుగా చేసి, అప్పడాల కర్రకి కూడా కొంచెం నూనె రాయండి. పిండి ముద్దను తీసుకుని, ఇంకోసారి మంచిగా ముద్దలా చేతిలో వత్తుకోండి. కొంచెం చేత్తో పిండిని అప్పడంలా వత్తి మధ్యలో పూర్ణాన్ని కొంచెం పెట్టుకోండి.
- Step 7
పైన పిండితో పూర్ణాన్ని మూసేసి, కొంచెం నూనె చుక్కలు పైన రాయండి. జిడ్డు చేసిన ప్లాస్టిక్ షీటుపై పెట్టి , పూరీలా అప్పడాల కర్రతో వత్తండి. బాండీని వేడిచేసి, ఈ వత్తిన దాన్ని అందులో వేసి వేయించండి.
- Step 8ముందు ఒకవైపు వేయించి, ఇంకోవైపు కొంచెం నూనెచుక్కలు వేస్తూ ఉండండి. మరలా తిప్పి గోధుమ రంగులోకి మారేవరకు వేయించండి.