దేశంలోని ఆయా ప్రాంతాల్లో కొన్ని వంటకాలు ప్రత్యేకమైనవి వుంటాయని అందరికీ తెలిసిందే! మరికొన్ని ప్రాంతాలైతే వంటకాలతోనే బాగా అభివృద్ధి చెంది వుంటాయి. అందులో భాగంగానే పెసరపప్పు ఆంధ్రావాళ్లకు స్పెషల్ రిసిపీ! దీనిని ప్రతిరోజూ వండుకుని వాళ్లు తింటారు.
ఇక రిసిపీ విషయానికొస్తే.. అన్ని రిసిపీలలోకన్నా ఇది ఎంతో రుచికరంగా వుంటుంది. సాధారణ పప్పుకంటే ఇది కాస్త డిఫరెంట్’గా వుంటుంది. సింధి స్టైల్లో తయారుచేసే ఈ వంటకాన్ని ఎంతో సులువగా చేయొచ్చు. ఎక్కువ ఫ్లేవర్స్ లేకుండా అనతికాలంలోనే వండేయొచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనాల్లో ఇది ఎంతో రుచికరంగా అనిపిస్తుంది.
ఇకపోతే.. ఇందులో మానవ శరీరానికి అవసరమయ్యే ప్రోటీనులు ఎక్కువ మోతాదులో వుంటాయి. తద్వారా ఇది తిన్నప్పుడు శరీరంలో శక్తి పెరుగుతుంది. అటు రుచిగానూ, ఇటు ఆరోగ్యపరంగా ఉపయోగపడే ఈ వంటకాన్ని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...