పచ్చిబఠానీలు (పీస్) - బంగాళదుంప (పొటాటో)ల మిశ్రమంతో తయారయ్యే ఈ పులావ్.. ఇండియాలో బాగానే పాపులర్ అయ్యింది. మొదట పంజాబ్’లో బాగా పాపులర్ అయిన ఈ రిసిపీ.. దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. వివిధ రకాల మసాలా దినుసులను జోడించి తయారుచేసే ఈ రిసిపీ ఎంతో రుచిగా వుండటమేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా! వివిధ రకాల ఇతర పదార్థాలలను జోడించడంతో అందులో వుండే పోషక విలువలు ఒక్కేసారి శరీరానికి అందుతాయి. ఫలితంగా శక్తి పెరుగుతుంది.
ఇక రిసిపీ విషయానికొస్తే.. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఈ డిష్’ను ఎంతగానో ఇష్టపడతారు. అత్యవసరమైన పరిస్థితుల్లో వంటకాలు చేయాల్సి వచ్చినప్పుడు.. ఆ సమయంలో ఈ పులావ్’ను చేస్తే మంచిది. ఎందుకంటే.. ఇతర రిసిపీలతో పోల్చుకుంటే దీనిని తక్కువ సమయంలోనే తయారుచేయొచ్చు. మరి.. ఇటువంటి సింపుల్ వంటకాన్ని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...