- Step 1
బియ్యంలో నీళ్లు పోసి పలుకుగా ఉడికించాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసి, అన్నం ఆరబెట్టాలి.
- Step 2
తర్వాత స్టౌమీద పాన్ పెట్టి, పోపుకు తగినంత నూనె వేసి, వేడి చేయాలి.
- Step 3
ఇప్పుడు అందులో వెల్లుల్లి తరుగు, పండుమిర్చి తరుగు, బీన్స్, క్యారట్ తరుగు వేసి కలపాలి. పోపుగింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, అన్నం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైనాపిల్ తో ఆహా అనిపించే చర్మం సౌందర్యం మీ సొంతం...
- Step 4
ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి చివరగా వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, ఉల్లికాడలతో, కొద్దిగా పెప్పర్ పౌడర్, నిమ్మరసంతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. అంతే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ. సూచన: మాంసాహారం ఇష్టపడేవారు ఉడికించిన బోన్‌లెస్ చికెన్ ముక్కలు లేదా గుడ్డును కూడా వాడుకోవచ్చు.