భోజనం చేసిన తర్వాత పాయాసం తాగడం కొంతమందికి అలవాటు. అలా తినడం వల్ల ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. ఇలా తింటే జీర్ణక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుందని మరికొంతమంది అభిప్రాయం! ఏదైతేనేం.. ఏదో ఒకరకంగా పాయాసం మాత్రం తాగుతారు. రకరకాల పద్ధతుల్లో పాయాసాన్ని తయారుచేసుకోవచ్చు. కొంతమంది బియ్యంతో చేసుకుంటే, మరికొంతమంది రవ్వతో, సేమియాలతో, ఇతర పదార్థాలతో చేసుకుంటారు. అందులో భాగంగానే కోకోనట్ మిల్క్ - సేమియా పాయసం కూడా ఒకటి!
సాధారణంగా ఈ పాయసాన్ని ఏదైనా పండుగ సందర్భంలోగానీ, శుభకార్యాలు నిర్వహించుకున్నప్పుడు లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇవి తాగుతున్నప్పుడు తియ్యగా వుండటంతోబాటు కడుపునింపుగా అనిపిస్తుంది. పైగా ఇందులో కొద్దిమోతాదులో పాలు కూడా వుంటుంది కాబట్టి అందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ పాయసాన్ని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...