- Step 1
ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసి తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
- Step 2
పోపు వేగేలోపు మిక్సీ జార్ లో కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, మరియు వెల్లుల్లి వేసి అవసరం అయితే కొద్దిగా నీళ్ళు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు పోపు వేగుతున్న కుక్కర్లో డిల్ హెర్బ్ మరియు మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి.
- Step 4
అలాగే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొన్న కప్పు బియ్యం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేయాలి.
- Step 5
ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టాలి. విజిల్ పెట్టాలి.
- Step 6
మొత్తం మిశ్రమం ఉడికి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉండి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే దిల్ రైస్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేయాలి.